| |
సపోట
మన రాష్ట్రంలో సపోట సుమారుగా 27,242 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, తూర్పు, పశ్శిమగోదావరి జిల్లాలలో అధికంగా సాగుచేయబడుతుంది. ఈ పంటను ఆశించే తెగుళ్లు, చీడలు తక్కువ. తోటలను తక్కువ పెట్టుబడితో పెంచి ఎక్కువ లాబాలను గడించవచ్చు. సపోట పండ్లు అధిక శక్తిని ఇస్తాయి. శరీరానికి కాల్షియం, విటమిన్లు అందజేస్తాయి. జ్వారాల నుండి కోలుకుంటున్న వారికి, పిల్లలకు ఈ పండు మంచి ఆహారం.
సపోట ఉష్ణ మండలపు పంట కనుక మన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అనువైనది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. కాబట్టి వర్షాధార పంటగా అనువైనది. గాలిలో తేమ ఎక్కువగా ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. |
|
నేలలు :
నీరు ఇంకే అన్ని రకాల నేలల్లోనూ పండుతుంది. తేలిక నేలల్లో త్వరగా ఎదిగి ఈ పంట మంచి ఫలసాయన్నిస్తుంది. ఇసక భూములు, చౌడు ఎక్కువగా ఉన్న నేలలు, ఉప్పు నేలలు కూడ నాటడానికి పనికి వస్తాయి. ఉదజని సూచిక మామూలు కన్నా ఎక్కువ (8.5-9.౦) ఉన్న భూములు కూడా అనుకూలం. నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం ఉండటం వలన కొండ ప్రాంతాలు, లోతు నేలల్లో కుడా వేసుకోవచ్చు. |
| |
రకాలు :
పాల :
మన రాష్ట్రంలో విస్తారంగా సాగులో ఉన్న రకం. దిగుబడి ఎక్కువ. పండు పరిమాణం చిన్నది. కోలగా ఉండి, గుత్తులుగా కాస్తుంది. తోలు పలుచగా ఉంటుంది. కండ మృదువుగా, అధిక తీపి కలిగి ఉంటుంది. పండ్ల నిలువకు, రవాణాకు, ఎగుమతి అనుకూలం కాదు.
క్రికెట్ బాల్ :
పండ్లు పెద్దవిగా గుండ్రంగా ఉంటాయి. కండ రవ్వలుగా ఉంటుంది. గింజలు అధికం. ఒక మోస్తరు తీపి కలిగి ఉంటుంది. సముద్రమట్టము నుడి వెయ్యి అడుగుల ఎత్తు వరకు గల ప్రాంతాలు, పొడి వాతావరణంలో బాగా పండుతుంది.
ద్వారపూడి :
పండ్లు ఆకారంలో క్రికెట్ బాల్ రకం వలే ఉండి చిన్న పరిమాణంలో ఉంటాయి. కండ బాగా రవ్వలుగా ఉంటుంది.
కీర్తి బార్తి :
పండ్లు అండాకారంలో ఉండి, పైతోలు మందంగా, కండ తియ్యగా ఉంటుంది.
కాలి పత్తి :
ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో వుంటాయి. పండు కోలగా, పరిమాణం మద్యస్త్యంగా ఉంటుంది. తోలు మందంగా, కండ తీయగా రుచిగా ఉంటుంది. నిలువకు, రవాణాకు, ఎగుమతికి అనుకూలం. అధిక దిగుబడినిచ్చే రకం.
పి.కె.యం-1 :
చెట్టు గుబురుగా పొట్టిగా ఉండటం వలన అధిక సాంద్రతతో నాటడానికి అనుకూలం. పండు కోలగా ఉండి, పరిమాణం మద్యస్త్యంగా ఉంటుంది. పండు తోలు పలుచక ఉండి మెత్తటి కండతో తీయగా ఉంటుంది. దిగుబడి ఎక్కువ.
పి.కె.యం-౩:
పండు కోలగా, పరిమణంలో మధ్యస్తంగా ఉండి పెద్దగ ఉంటుంది. రుచిగా ఉంటుంది. చెట్టు నిలువుగా పెరగటం వల్ల కొబ్బరి వంటి తోటల్లో అంతర పంటగా సాగుచేయడానికి అనుకూలం
డిహెచ్ యస్-1,డిహెచ్ యస్ -2:
కాయలు కోలగా, పెద్దవిగా, తియ్యగా ఉంటాయి. సింగపూర్, విరుదనగర్, తగరంపూడి, గుత్తి, గవరయ్య వంటి రకాలు కూడ సాగుకు అనుకూలం.
సపోటను నాటిన తరువాత 50-60 సంవత్సరాల వరకు పంటనిస్తుంది. కాబట్టి సరైన రకాన్ని ఎంపిక చేసుకోకపోతే తరువాత కాలంలో బాగా నష్టపడవలసి వస్తుంది. |
|
నాటడం :
కొమ్మంటూ పద్ధతి ద్వార ప్రవర్తనం చేయబడిన అంటు మొక్కలను ఎంపిక చేసుకోవాలి. జూలై నుండి ఫిబ్రవరి వరకు నాటడానికి అనుకూలం. ఎంపిక చేసిన రకాన్ని 10.౦ *10.౦ మీటర్ల దూరంలో ఎకరానికి 40మొక్కల చొ”న నాటుకోవాలి. నాటడనికి 1*1*1మీ. గుంతలను తీసి, తవ్విన మట్టికి 30కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 2 కిలోల సూపర్ ఫాస్పేట్, 200 గ్రాముల పెరాధియాన్ (ఫాలిడాల్) పొడి మందు కలిపి గుంతలను నింపాలి. గుంటలను నింపేటపుడు ఒక అడుగు లోతున 10-15కిలోల (4” – 6” మందం) కొబ్బరి పొట్టు పోయాలి. కొబ్బరి పొట్టు వేసవిలో ఎక్కువ నీరు నిల్వ చేసుకుని, మొక్కలకు నీటి ఎద్దడి రానివ్వదు. కుళ్ళిన తర్వాత మంచి సేంద్రియ ఎరువుగా మారి చెట్టుకు ఉపకరిస్తుంది. అంట్లను గుంతల మద్యలో ఉంచి, అంటు బాగం భూమిపైకి ఉండే విధంగా నాటుకొవాలి. నాటిన మొక్కలకు పాదులు చేసి, నీరుపోసి మొక్కలు గాలికి ఒరిగిపోకుండ కర్రపాతి ఊతం యివ్వాలి. వేరు మూలం నుండి పెరిగే పక్క కొమ్మలను ఎప్పటికపుడు తొలగించాలి. |
|
ఎరువుల యాజమాన్యం :
తొలకరిలో తోటలను ఇరువైపుల దుక్కి దున్ని, చెట్లకు పాదులు చేసి ఎరువులను వేయాలి. ప్రతి చెట్టుకు ఈ క్రింది మోతాదులో ఎరువులను చెట్టు చుట్టూ 1.5 మీటర్ల దూరంలో పాదాంత సమంగా వేసి, మట్టిలో కలపాలి. ఎరువులు కరగడానికి సరిపడేంత మేర తేలికపాటి తడి మాత్రమే ఇవ్వాలి.
మొక్క వయస్సు
(సం//) |
నత్రజని
( గ్రాములు) |
యూరియ
(గ్రాములు) |
భాస్వరం
(గ్రాములు) |
సింగిల్ సూపర్ ఫాస్పేట్
(గ్రాములు) |
పోటాష్
(గ్రాములు) |
మ్యూరేట్ అఫ్ పోటాష్
(గ్రాములు) |
చివికిన
పశువుల ఎరువు
(కిలోలు) |
1-౩ |
50 |
110 |
20 |
125 |
75 |
125 |
25 |
4-5 |
100 |
22౦ |
40 |
25౦ |
15౦ |
25౦ |
50 |
5-8 |
200 |
44౦ |
80 |
50౦ |
30౦ |
50౦ |
50 |
8 |
40౦ |
88౦ |
16౦ |
100౦ |
45౦ |
75౦ |
50 |
|
|
నీటి యాజమాన్యం:
సపోట చెట్లు నీటి ఎద్దటిని ఎక్కువుగా తట్టుకుంటాయి. మొక్కలు నాటిన రెండు సంవత్సరాల వరకు వేసవిలో నీటి ఎద్దటి రాకుండా ప్రతి 15 రోజుల కొకసారి తడి ఇవ్వాలి. ఎదిగిన చెట్లకు, వేసవిలో 30 రోజుల కొకసారి తడి ఇవ్వాలి. డ్రిప్ పద్దతిలో నీరు ఇచినట్లియితే ప్రతి చెట్టుకు కాలాన్ని బట్టి 60-10౦లీ. నీటిని ప్రతిరోజూ ఇవ్వాలి.
కలుపు నివారణ, అమ్తరసేద్యం : తొలకరిలో నేలను దున్ని పాదులో, కాళీగా వున్నా భూమిలో పచ్చిరోట్ట పైర్లు వేసి, 45 రోజుల తరువాత భూమిలో కలియదున్నడం వలన నిర్మూలన, భూమి సారవంతవడమే కాకుండా నీటి నిల్వ సామర్ద్యం కుడా పెరుగుతుంది. తరువాత అవసరమైతే 1 లేక 2 సార్లు నేలను దున్నడం ద్వార కలుపును నిర్ములించవచ్చు. లేత తోటల్లో వేరుశెనగ, అపరాలు, కాయగూరలు సాగుచేసి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. కలుపు నివారణకు గ్లై ఫోస్పేట్ కలుపు మందును లీటర్ నీటికి 5 నుండి 8 మీ.లీ చొప్పున పిచికారి చేయాలి. |
|
పంటకోత, దిగుబడి :
నాలుగేళ్ల వరకు పూతను తొలగించి 5 లేక 6వ ఏట నుండి కాయలు కోయవచ్చు. ముదరని కాయలను కోయడం వల్ల సరిగా పండవు. అందువల్ల పక్వానికి వచ్చిన కాయలనే కోయాలి. కాయలను ఒకేసారి కోయకుండా ౩-4 కోతల్లో కాయలు కోయడం మంచిది. పక్వానికి వచ్చిన కాయలపై ఉన్న పొట్టు వంటి పదార్దం రాలిపోయి, కాయలు బంగాళదుంపలవలె కనపడతాయి. అటువంటి కాయల చర్మాన్నిగోకినప్పుడు కండ పై భాగం ఆకుపచ్చగా కాకుండా పసుపు పచ్చ రంగులో ఉంటుంది. పక్వానికి వచ్చిన కాయల చివర నున్న సన్నటి ముల్లు చేయికి తగలగానే ఊడి పోతుంది. ఈ కాయలను కోసినప్పుడు తక్కువ పాలు కారతాయి. ఈ విధంగా పక్వదశను సరిచూసుకుని కాయలను కోయడం అనుభవంతోనే సాద్యం.
కాయలను తొడిమాతో సహా కోయాలి. కోసిన కాయలను నీడలో ఉంచాలి. కోత అనంతరం సరైన జాగ్రత్త పాటించనట్లయితే కాయలు నిలువ వుంచినపుడు కుళ్లే ప్రమాదం ఉంది. పండిన సపోటలను రవాణా చేయడం కష్టం కనుక పక్వానికి వచ్చిన కాయలను కోసి, రవాణా చేయడానికి ముందు 100౦ పి. పి.యం ఎధ్రేల్ (1మీ మందును లీటరు నీటికి కలిపి) ద్రావణంలోముంచడం గానీ, కాయలపై పిచికారి చేయడం గానీ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల కాయలు 4 రోజులలో పండుతాయి. సాదరణంగా 10 సంవత్సరాల వయస్సు ఉన్న చెట్లకు 100౦-1500 కాయలు, 20 సంవత్సరాల పైబడిన చెట్లకు 2౦౦౦-2500 కాయలు, 25 సంవత్సరాల పైబడిన చెట్లకు ౩౦౦౦ కాయల వరకు ప్రతి సంవత్సరం పొందవచ్చు.
కొమ్మల కత్తిరింపు :
సపోటలో ప్రత్యేకంగా కొమ్మల కత్తిరింపు అవసరం లేదు. ఎదిగే మొక్కలకు ౩ అడుగుల లోపు ప్రధాన కాండం మీద ఉన్న కొమ్మలను తొలగించి ఆ తరువాత 4-5 కొమ్మలను ఉంచితే చాలు. ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మలను, లొపలి భాగంలో గుబురుగా పెరిగిన కొమ్మలను, నేలను తాకే క్రింది కొమ్మలను తొలగించాలి. |
| |
| |
| |
|
 |